Breaking News

IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!

Published on Thu, 11/23/2023 - 09:40

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 23) తొలి మ్యాచ్‌ జరుగనుంది. వైజాగ్‌ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం​ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు.

ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్‌ సైతం వారి కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ హీరో ట్రవిస్‌ హెడ్‌ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఆసీస్‌ తమ రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లను తొలి మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్‌ స్కై, ఇషాన్‌ కిషన్‌, యశస్వి, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్‌ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్‌, బిష్ణోయ్‌లతో భారత స్పిన్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్‌, ప్రసిద్ద్‌, ముకేశ్‌ కుమార్‌లతో కూడిన పేస్‌ విభాగమే కాస్త వీక్‌గా ఉంది.

మనదే పైచేయి.. 
ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే..  ఆసీస్‌పై భారత్‌ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్‌ 15, ఆసీస్‌ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్‌లు ఆడగా భారత్‌ 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

విశాఖలోనూ మనోళ్లే..! 
విశాఖపట్నంలో టీమిండియా  ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్‌లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది.   


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)