Breaking News

హెట్‌మైర్ విధ్వంసం.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో! తాహిర్ పాంచ్ ప‌టాకా..

Published on Sat, 08/23/2025 - 12:49

ద‌క్షిణాఫ్రికా లెజెండ‌రీ స్పిన్న‌ర్ ఇమ్రాన్ త‌హిర్ వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది పాత వైన్‌లా తాయారు అవుతున్నాడు.   క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు సార‌థ్యం వ‌హిస్తున్న 46 ఏళ్ల త‌హిర్.. శుక్ర‌వారం ఆంటిగ్వాతో జ‌రిగిన మ్యాచ్‌లో బంతితో అద్బుతం చేశాడు.  త‌న స్పిన్ మ‌యాజాలంతో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును త‌హిర్ దెబ్బ‌తీశాడు.

ఈ సౌతాఫ్రికా మాజీ స్పిన్న‌ర్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 21 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అందులో ఒక మెయిడిన్ ఓవ‌ర్ కూడా ఉంది. అత‌డి బౌలింగ్ ధాటికి 212 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఆంటిగ్వా మరియు బార్బుడా ఫాల్కన్స్ కేవ‌లం 128 ర‌న్స్‌కే కుప్ప‌కూలింది. 

గయానా బౌల‌ర్ల‌లో అత‌డితో పాటు డ్వేన్ ప్రిటోరియ‌స్‌, షెఫెర్డ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఆంటిగ్వా బ్యాట‌ర్ల‌లో కరీమా గోర్ 31 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

హెట్‌మైర్‌, హోప్ విధ్వంసం..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. గ‌యానా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ షాయ్ హోప్‌(54 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 82),హెట్‌మైర్‌(26 బంతుల్లో  5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 65), షెఫెర్డ్‌(8 బంతుల్లో 25) విధ్వంసక‌ర ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఆంటిగ్వా బౌల‌ర్ల‌లో వసీం, జైడ‌న్ సీల్స్‌, మెకాయ్ త‌లా వికెట్ సాధించారు. మిగితా బౌల‌ర్లంతా భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఐదు వికెట్ల‌తో స‌త్తాచాటిన త‌హిర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.
 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)