రాణించిన నరైన్‌.. ఎలిమినేటర్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు

Published on Fri, 01/02/2026 - 16:02

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్‌-1లో గెలిచి డెజర్ట్‌ వైపర్స్‌ నేరుగా ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీ కొనసాగుతుంది. 

నిన్న (జనవరి 1) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌పై తిరుగులేని విజయం సాధించి, ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్స్‌-2కు (ఎంఐ ఎమిరేట్స్‌తో) అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2 విజేత జనవరి 4న జరిగే ఫైనల్లో డెజర్ట్‌ వైపర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌పై అబుదాబీ నైట్‌రైడర్స్‌ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. మైఖేల్‌ పెప్పర్‌ (49 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (43), ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (22 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లతో సత్తా చాటగా.. హైదర్‌ అలీ, వకార్‌ సలాంఖిల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన క్యాపిటల్స్‌.. 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సునీల్‌ నరైన్‌ (3-0-12-3), జేసన్‌ హోల్డర్‌ (3.2-0-18-3), లివింగ్‌స్టోన్‌ (4-0-26-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించారు. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన నబీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)