Breaking News

చాంపియన్‌ స్వియాటెక్‌

Published on Sun, 06/09/2024 - 04:30

పారిస్‌: వరల్డ్‌ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ ఎర్ర మట్టిపై తన జోరును కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది ఆమె చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ (పోలండ్‌) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్‌ జాస్మిన్‌ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. 

2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన స్వియాటెక్‌...అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్‌ ఓపెన్‌ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలలో ఫైనల్‌ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్‌ టైటిల్‌ దక్కించుకోవడం విశేషం. 2007 (జస్టిన్‌ హెనిన్‌) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె నిలిచింది.  

తొలి సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్‌లో స్వియాటెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి పావ్లిని 2–1తో ముందంజ వేసినా...అది అక్కడితో సరి. పోలండ్‌ స్టార్‌ ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్లు చెలరేగిపోయి వరుసగా 10 గేమ్‌లను గెలుచుకుంది. ఫలితంగా తొలి సెట్‌ను గెలుచుకోవడంతో పాటు రెండో సెట్‌లోనూ 5–0తో విజయానికి చేరువైంది. 

ఈ స్థితిలో తర్వాతి గేమ్‌ను ఎలాగో పావ్లిని గెలుచుకోగలిగినా...తర్వాతి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకొని స్వియాటెక్‌ సంబరాలు చేసుకుంది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వియాటెక్‌ 18 విన్నర్లు కొట్టగా...18 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌తో పావ్లిని తన ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు (సుమారు రూ. 22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

నేడు పురుషుల ఫైనల్‌ 
అల్కరాజ్‌ (స్పెయిన్‌) X  జ్వెరెవ్‌ (జర్మనీ)
సా.గం.6.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)