Breaking News

సెమీస్‌లో స్వియాటెక్‌

Published on Thu, 01/23/2025 - 03:52

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో స్టార్‌ ప్లేయర్లు ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), యానిక్‌ సినెర్‌ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ స్వియాటెక్‌ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్‌లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ కూడా వరుస సెట్‌లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 

బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌  6–1, 6–2తో ఎనిమిదో సీడ్‌ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్‌ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన స్వియాటెక్‌ 22 విన్నర్స్‌ కొట్టింది. 

మరో క్వార్టర్‌ ఫైనల్లో 19వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్‌)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్‌)తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా (బెలారస్‌); కీస్‌తో స్వియాటెక్‌ తలపడతారు.   

షెల్టన్‌ తొలిసారి... 
పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ టైటిల్‌ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్‌ స్టార్‌ బెన్‌ షెల్టన్‌ తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

క్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్‌ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్‌తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్‌ కొట్టిన సినెర్‌... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)