Breaking News

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత స్వియాటెక్‌

Published on Sat, 06/10/2023 - 22:24

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా వరల్డ్‌ నెంబర్‌ వన్‌.. పోలాండ్‌ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్‌ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది.

అయితే రెండోసెట్‌లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్‌ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్‌ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్‌.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ ఫ్రెంచ్‌ఓపెన్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్‌ గారోస్‌ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్‌ చరిత్ర సృష్ఠించింది. 

చదవండి: 'చీటింగ్‌ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)