Breaking News

పాక్‌ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్‌ ఆటగాడు

Published on Thu, 04/24/2025 - 13:42

న్యూజిలాండ్‌ విధ్వంసకర వీరుడు కొలిన్‌ మున్రో ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025 ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అతను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 23) జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ ముల్తాన్‌ సుల్తాన్స్‌తో తలపడింది. 

ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో మున్రో కీలకపాత్ర పోషించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో మున్రో తన ఆటతీరుతో కాకుండా వేరే విషయం కారణంగా వార్తల్లో నిలిచాడు. మున్రో బ్యాటింగ్‌ చేస్తుండగా సుల్తాన్స్‌ బౌలర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌తో గొడవ జరిగింది. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతిని ఇఫ్తికార్ బ్లాక్‌హోల్‌లోకి వేయగా మున్రో దాన్ని విజయంవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చక్ (చట్టవిరుద్ధమైన బౌలింగ్ శైలి) చేస్తున్నాడని మున్రో ఆరోపించాడు.

దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్‌ మున్రో వైపు దూసుకొచ్చి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం​ చెప్పాడు. చకింగ్‌ చేస్తున్నావని చెప్పడంలో తప్పేముందున్నట్లు నిలదీశాడు. మధ్యలో సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. అతను కూడా మున్రోతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చివరికి అంపైర్ల జోక్యంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆతర్వాత కూడా ఇఫ్తికార్‌ వివాదాస్పద శైలితోనే బౌలింగ్‌ కొనసాగించాడు. లీగ్‌ వారిదే కావడంతో మున్రో చేసేదేమీ లేక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఛేదనలో తన జట్టు విజయానికి మంచి పునాది వేసి ఔటయ్యాడు. ఆండ్రియస్‌ గౌస్‌ (80 నాటౌట్‌) చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

ఈ మ్యాచ్‌లో ఇఫ్తికార్‌ 2 ఓవర్లు వేసి వికెట్‌ లేకుండా 20 పరుగులు సమర్పించుకున్నాడు. పాక్‌ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీయడంతో క్రికెట్‌ అభిమానులు మున్రో ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే చట్టవిరుద్ధమైన శైలితో బౌలింగ్‌ చేస్తున్నా పట్టించుకోని పాక్‌ అంపైర్లను చీవాట్లు పెడుతున్నారు. 

పాకిస్తాన్‌లో క్రికెట్‌ అంటే ఇంత కంటే గొప్పగా ఏమీ ఆశించలేమని సర్దుకు పోతున్నారు. మున్రో పేరిట న్యూజిలాండ్‌ తరఫున రెండో వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉంది. 38 ఏళ్ల మున్రో న్యూజిలాండ్‌ తరఫున 3 టీ20 సెంచరీలు చేశాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు