Breaking News

అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్‌ సోదరుడి వార్నింగ్‌

Published on Wed, 11/08/2023 - 19:17

Angelo Mathews-  Shakib Al Hasan- Timed Out: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ సోదరుడు ట్రెవిన్‌ మాథ్యూస్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ‘టైమ్డ్‌ అవుట్‌’ విషయంలో షకీబ్‌ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.

క్రీడాస్ఫూర్తిని మరిచిన అతడు శ్రీలంకలో అడుగుపెడితే అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రెవిన్‌ పేర్కొన్నాడు. షకీబ్‌కు రాళ్లతో సన్మానం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ అనూహ్య, అరుదైన రీతిలో అవుటైన విషయం తెలిసిందే.

ఆలస్యం చేశాడు.. అనుభవించకతప్పలేదు
న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. లంక ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ రెండో బంతికి సమరవిక్రమ అవుటయ్యాడు. నిబంధనల ప్రకారం తర్వాతి బ్యాటర్‌ 2 నిమిషాల్లోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. క్రీజ్‌లోకి మాథ్యూస్‌ సరైన సమయానికే వచ్చినా బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేశాడు. 

తన హెల్మెట్‌ను సరి చేసుకుంటుండగా దాని స్ట్రాప్‌ తెగింది. దాంతో మరో హెల్మెట్‌ కోసం సైగ చేయగా, చమిక మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సమయం మించిపోవడంతో బౌలర్, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ ‘టైమ్డ్‌ అవుట్‌’ కోసం అప్పీల్‌ చేశాడు. 

ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు చర్చించి నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ‘అవుట్‌’గా ప్రకటించారు. ఈ క్రమంలో తన హెల్మెట్‌ సమస్యను మాథ్యూస్‌ అంపైర్లకు వివరించినా వారు స్పందించలేదు.

బతిమిలాడినా మనసు కరగలేదు
ఆ తర్వాత అప్పీల్‌ వెనక్కి తీసుకోమని షకీబ్‌ను కూడా కోరినా అతను ససేమిరా అనడంతో మాథ్యూస్‌ వెనుదిరగక తప్పలేదు. దీంతో.. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్డ్‌ అవుట్‌’ ద్వారా అవుట్‌ అయిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్‌ నిలిచాడు. 

ఈ నేపథ్యంలో జెంటిల్మన్‌ గేమ్‌లో షకీబ్‌ క్రీడాస్ఫూర్తిని విస్మరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన ఏంజెలో మాథ్యూస్‌ సోదరుడు ట్రెవిన్‌ మాథ్యూస్‌ షకీబ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రాళ్లు విసరడం ఖాయం
దక్కన్‌ క్రానికల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము నిరాశకు గురయ్యాం. బంగ్లాదేశీ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. జెంటిల్మన్‌ గేమ్‌లో అతడు మానవతా దృక్పథం కనబరచకలేకపోయాడు.

ఇకపై అతడికి శ్రీలంకలో ఎవరూ స్వాగతం పలకరు. ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్‌ లేదంటే లంక ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు ఇక్కడికి వస్తే.. అతడిపై రాళ్లు విసురుతారు. అభిమానుల నుంచి అతడు ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ట్రెవిన్‌ మాథ్యూస్‌ షకీబ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు.

కాగా ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అప్పటికి షకీబ్‌- మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి!! 

ఫోర్త్‌ అంపైర్‌ చెప్పిందిదే
లంక ఇన్నింగ్స్‌ అనంతరం.. మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌పై ఫోర్త్‌ అంపైర్‌ ఏడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ‘మాథ్యూస్‌కు హెల్మెట్‌ సమస్య కూడా   రెండు నిమిషాల తర్వాత వచ్చింది. 

అప్పటికీ అతను బంతిని ఎదుర్కోకుండా ఆలస్యం చేశాడు. క్రీజ్‌లోకి వచ్చే ముందు ఎక్విప్‌మెంట్‌లో అన్నింటినీ సరిగ్గా చూసుకోవడం కూడా బ్యాటర్‌దే బాధ్యత’ అని ఆయన చెప్పారు.

దాంతో షకీబ్‌ క్రీడా స్ఫూర్తి అంశాన్ని పక్కన పెడితే నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించడం సరైందే కదా అని క్రికెట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  కాగా షకీబ్‌ను అవుట్‌ చేసిన తర్వాత మాథ్యూస్‌ కూడా వాచీ చూసుకుంటున్నట్లుగా అభినయిస్తూ నీ టైమ్‌ అయిపోయిందిక అన్నట్లు సైగ చేయడం గమనార్హం.

ఇక ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ప్రపంచకప్‌ టోర్నీలో శ్రీలంకపై తొలి విజయం నమోదు చేసింది.

చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్‌... అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!
ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)