Breaking News

ICC: ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ రేసులో ఆసీస్‌ కెప్టెన్‌..

Published on Tue, 01/09/2024 - 19:51

డిసెంబర్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ ఫిలిఫ్స్, బంగ్లాదేశ్ పేస‌ర్ తైజుల్ ఇస్లాం ఉన్నారు. వీరిముగ్గురూ డిసెంబర్‌ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.

ప్యాట్‌ కమ్మిన్స్‌ విషయానికి వస్తే.. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కమ్మిన్స్‌ నిప్పులు చేరిగాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 10 వికెట్లతో కమ్మిన్స్‌ సత్తాచాటాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో డిసెంబ‌ర్‌లో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా స్పిన్నర్‌ తైజుల్ ఇస్లాం నిప్పులు చేరిగాడు. తొలి టెస్టులో 6 వికెట్లు తీసి బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

అదే సిరీస్‌లో కివీస్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ విరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్లతో సత్తాచాటిన అనంతరం బ్యాటింగ్‌లో కూడా 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ముగ్గురిలో అవార్డు ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి. ఇక మహిళల విభాగంలో భారత భార‌త క్రికెట‌ర్లు జెమీమా రోడ్రిగ్స్, స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌ నిలిచారు. వీరిద్దరితో పాటు  జింబాబ్వే బౌలర్‌ ప్రీసియ‌స్ మ‌రంగే తొలిసారి ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు బ‌రిలో నిలిచింది.
చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)