Breaking News

అశ్విన్ రిటైర్మెంట్‌కు కార‌ణ‌మిదే?.. ఆసీస్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Published on Wed, 01/08/2025 - 10:52

బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగ‌తి తెలిసిందే. అత‌డి నిర్ణ‌యం యావ‌త్తు క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు.

ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదిక‌గా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్ర‌మే భాగ‌మ‌య్యాడు. ఆ మ్యాచ్‌లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌(మూడో టెస్టు)కు తుది జ‌ట్టు నుంచి అత‌డిని టీమ్‌మెనెజ్‌మెంట్ త‌ప్పించింది.

ఆ మ్యాచ్ త‌ర్వాతే అశ్విన్ ఇంట‌ర్ననేష‌న‌ల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆక‌స్మిక రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ బ్రాడ్ హాడిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బీజీటీ సిరీస్‌లో ప్లేయింగ్  ఎలెవ‌న్‌లో చోటుద‌క్కక‌పోవ‌డంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

"టీమిండియా సరైన గేమ్ ప్లాన్‌తో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు రాలేదు. వారు త‌మ మొద‌టి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవ‌కాశ‌మిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేద‌ని అప్పుడే ఆర్ధ‌మైంది. అయితే అశ్విన్ సిరీస్ మ‌ధ్య‌లోనే రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌పోవ‌డంతో అత‌డు నిరాశ‌చెందిన‌ట్లు ఉన్నాడు. బ‌హుశా అప్పుడే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయిన‌ట్లు అన్పిస్తోంది. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అశ్విన్ నంబ‌ర్ 1 స్పిన్న‌ర్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అత‌డి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆట‌గాళ్లు ఎవ‌రూ కూడా బెంచ్‌కే ప‌రిమితం కావాలనుకోరు. క‌చ్చితంగా అత‌డు నిరాశ‌కు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మ‌ధ్య‌లోనే త‌న కెరీర్‌ను ముగించాడ‌ని" హాడిన్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా అశ్విన్‌ రిటైర్మెంట్‌‍పై అతడి తం‍డ్రి రవిచంద్రన్‌ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడని ఆయన సంచలన ‍వ్యాఖ్యలు చేశారు.

టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ మార్క్‌..
అశ్విన్ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్‌ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడనున్నాడు.
చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే..

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)