Breaking News

అంతటి సచిన్‌కే తప్పలేదు.. టీ20 వరల్డ్‌కప్‌ టీమిండియాదే: రవిశాస్త్రి

Published on Mon, 11/27/2023 - 18:28

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో భారత్‌ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుందని ఎవరూ ఊహించివుండరు. అయితే  మెగా టోర్నీలో ఓటమి తర్వాత అదే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. అభిమానుల్లో కాస్త జోష్‌ను నింపింది.  సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో యువ భారత జట్టును తొలి రెండు టీ20ల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసింది.

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌ తర్వాత దక్షిణాఫ్రికాతో కూడా భారత్‌ టీ20ల్లో పాల్గోనుంది. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20లో ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్‌ ఫేవరేట్‌ అని రవిశాస్త్రి తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024 అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్‌లో జరగనుంది.

"ఏదీ కూడా సులభంగా రాదు. సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్‌ ఒక ప్రపంచకప్‌ను గెలవడానికి ఆరు వరల్డ్‌కప్‌ల వరకు వేచి చూశాడు. వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఫైనల్‌ రోజు మనం ఎలా ప్రదర్శన చేశామన్నదే పరిగణలోకి వస్తుంది.  ఇటువంటి మెగా టోర్నీల్లో సెమీఫైనల్‌-ఫైనల్లో మంచి ప్రదర్శన చేస్తేనే వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలుస్తారు. లీగ్‌ స్టేజిలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆసీస్‌.. సెమీస్‌, ఫైనల్లో అద్భుతంగా రాణించింది కాబట్టి విజేతగా నిలిచింది.

భారత్‌ ఓటమి నన్ను ఇప్పటికి బాధిస్తోంది. కానీ మా బాయ్స్‌ ఈ ఓటమి నుంచి మా బాయ్స్‌ చాలా విషయాలు నేర్చుకున్నారు. వారు సానుకూల దృక్పథంతో తమ ఆటను కొనసాగిస్తున్నారు. భారత్‌ త్వరలోనే ప్రపంచకప్‌ గెలుస్తుందని నేను ఆశిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌-2024ను టీమిండియా సొంతం చేసుకునే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం కసితో ఉంది. ప్రధాన పోటీ దారుగా భారత్‌ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం భారత జట్టు టీ20 ఫార్మాట్‌పైనే దృష్టిపెట్టాలి’’ అని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లాంఛ్‌ ఈవెంట్‌లో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండిVirat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా?

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)