Breaking News

నవీన్‌ ఉల్‌ హక్‌ కరెక్ట్‌ కాబట్టి అతనిపై వైపే నిలబడ్డా.. కోహ్లితో వివాదంపై గంభీర్‌ కామెంట్స్‌

Published on Mon, 06/12/2023 - 17:28

ఐపీఎల్‌ 2023 సందర్భంగా విరాట్‌ కోహ్లితో చోటు చేసుకున్న వివాదంపై గౌతమ్‌ గంభీర్‌ తొలిసారి స్పందించాడు. నాటి తన ప్రవర్తనను గంభీర్‌ సమర్ధించుకున్నాడు. నాటి ఉదంతంలో నవీన్‌ తప్పేమీ లేదని.. తన దృష్టిలో నవీన్‌ చేసింది కరెక్ట్‌ కాబట్టి, అతనికి అండగా నిలబడ్డాడని, మెంటార్‌గా అది నా కనీస బాధ్యత అని వివరణ ఇచ్చాడు.

ఒకవేళ ఆ సందర్భంలో కోహ్లి చేసింది కరెక్ట్‌ అయ్యుంటే, అతని పక్షాన నిలబడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం​ ఉండేది కాదని తెలిపాడు. ఆట ఏదైనా ప్రతి ఆటగాడు గెలవాలని కోరుకోవడం సహజమని.. అందుకోసం ఎవరు కూడా హద్దులు దాటాల్సి పని లేదని హితవు పలికాడు.  

తన దృష్టిలో ఏ ఆటగాడైనా ఒకటేనని.. ధోనితో అయినా విరాట్‌తో అయినా తన అనుబంధం ఒకటేలా ఉంటుందని.. కోహ్లితో జరిగిన వాగ్వాదం మైదానానికే పరిమితం​ అని వివాదానికి పుల్‌స్టాప్‌ పెట్టాడు. 

పరాయి దేశ ఆటగాడికి అండగా నిలబడి, స్వదేశీ ఆటగాడితో వాగ్వాదానికి దిగాడని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. తన దృష్టిలో మన, పరాయి బేధాలు లేవని, ఎవరిది కరెక్ట్‌ అనిపిస్తే వారి పక్షాన నిలబడతానని అన్నాడు. 

కాగా, ఐపీఎల్‌ 2023లో లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత నవీన్‌-విరాట్‌ మధ్య.. మ్యాచ్‌ అనంతరం గంభీర్‌-కోహ్లిల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గంభీర్‌-కోహ్లిలు బాహాబాహీకి దిగినంత పనిచేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ గంభీర్‌, కోహ్లిలకు జరిమానా కూడా విధించింది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)