Breaking News

కోహ్లి కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ

Published on Tue, 12/05/2023 - 13:31

విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని దాదా మరోసారి వివరణ ఇచ్చాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత​ ఓవర్ల ఫార్మాట్‌ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని పేర్కొన్నాడు. అది కూడా కోహ్లి మంచికోసమే తాను చెప్పానని తెలిపాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గంగూ భాయ్‌ ఈ వివరణ ఇచ్చాడు. 

కాగా, 2021లో అనూహ్య పరిణామాల నడుమ విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం​ తెలిసిందే. తొలుత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రన్‌ మెషీన్‌ ఆతర్వాత కెప్టెన్సీ నుం​చి పూర్తిగా వైదొలిగాడు. తనను సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని అప్పట్లో కోహ్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంలో నాటి బీసీసీఐ బాస్‌ గంగూలీ కీలకపాత్ర పోషించాడని కోహ్లి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తనకు ఫోన్‌ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తదనంతరం కూడా ఈ విషయంపై కోహ్లి-గంగూలీ మధ్య పరోక్ష యుద్దం జరిగింది. వీరిద్దరూ ఒకరికొరకు ఎదురుపడినప్పుడు కూడా పలకరించుకునేవారు కాదు. ఐపీఎల్‌ 2023 సందర్భంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లి కెప్టెన్సీ నుంచి దిగిపోయాక తదనంతర పరిణామాల్లో రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలోనే టీమిండియా ఇటీవల వన్డే ప్రపంచకప్‌ ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలై మూడోసారి ప్రపంచకప్‌ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)