Breaking News

బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు?

Published on Sun, 08/20/2023 - 10:13

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు  ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్,  బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్‌సీఏ.. భారత క్రికెట్‌ బోర్డుకు షాకిచ్చింది.

కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్‌) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్‌సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్‌-శ్రీలంక మ్యాచ్‌ ఆక్టోబర్‌ 12 హైదారాబాద్‌గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్‌ మార్చడంతో ఆ మ్యాచ్‌ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్‌పై  బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి
చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్‌ కాదు.. వన్డే ప్రపంచకప్‌లో భారత వికెట్‌ కీపర్‌ అతడే!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)