Breaking News

తిలక్‌ వర్మకు బంపరాఫర్‌.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌

Published on Fri, 10/13/2023 - 07:32

దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు తొలిసారి హైదరాబాద్‌ జట్టు పగ్గాలు అప్పగించారు. తిలక్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో తిలక్‌ దుమ్మురేపాడు. అంతకుముం‍దు తను అరంగేట్రం చేసిన వెస్టిండీస్‌ సిరీస్‌లో తిలక్‌ అకట్టుకున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తిలక్‌కు హెచ్‌సీఏ అప్పగించింది.

ఈ టోర్నీ అక్టోబర్‌ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో అజింక్యా రహానే, రింకూ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు భాగం కానున్నారు.

హైదరాబాద్‌ టీ20 జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), సీవీ మిలింద్‌ (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, రాహుల్‌ సింగ్, రాహుల్‌ బుద్ది, రాహుల్‌ రాధేశ్, రోహిత్‌ రాయుడు, చందన్‌ సహని, భవేశ్‌ సేథ్, రవితేజ, రక్షణ్‌ రెడ్డి, సంకేత్, తనయ్‌ త్యాగరాజన్, అనికేత్‌ రెడ్డి, షౌనక్‌ కులకర్ణి, అమన్‌ రావు.
చదవండి: WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో ఓటమి

 

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు