Breaking News

టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...

Published on Fri, 12/26/2025 - 03:48

దోహా: ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు నేడు తెరలేవనుంది. తొలి మూడు రోజులు ర్యాపిడ్‌ విభాగం గేమ్‌లు... ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్‌ విభాగం గేమ్‌లు జరుగుతాయి. మహిళల ర్యాపిడ్‌ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2019, 2024లలో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన హంపి మూడోసారి ఈ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. 

మహిళల విభాగంలో భారత్‌ నుంచి హంపితోపాటు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవితా శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, పర్ణాలి, చర్వీ పోటీపడుతున్నారు. ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణతోపాటు మరో 25 మంది గ్రాండ్‌మాస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.  

ఓపెన్‌ ర్యాపిడ్‌ విభాగంలో 13 రౌండ్లు... మహిళల ర్యాపిడ్‌ విభాగంలో 11 రౌండ్లు నిర్వహిస్తారు. ఓపెన్‌ బ్లిట్జ్‌ విభాగంలో 19 రౌండ్లు... మహిళల బ్లిట్జ్‌ విభాగంలో 15 రౌండ్లు ఉంటాయి. బ్లిట్జ్‌ విభాగంలో నిర్ణీత రౌండ్లు ముగిశాక టాప్‌–4లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ర్యాపిడ్‌ విభాగంలో మాత్రం అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టైటిల్‌ లభిస్తుంది. ఓపెన్, మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగాల విజేతలకు 70 వేల యూరోల (రూ. 74 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)