Breaking News

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

Published on Tue, 08/29/2023 - 20:48

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అత‌ను కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. తాజాగా (ఆగస్ట్‌ 29) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు.

ప్రణయ్‌ గతేడాది డిసెంబర్‌ నుంచి టాప్‌-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ తర్వాత లక్ష్యసేన్‌ (12) భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్‌ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 

కాగా, ప్రణయ్‌ ఇటీవల ముగిసిన వరల్డ్‌ బ్యాడింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని, సూపర్‌-500 మలేసియా మాస్టర్స్‌ టైటిల్‌ను, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు.  

సింధుకు 14వ ర్యాంక్..
మహిళల విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజా ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)