Breaking News

హెండర్సన్‌కు అత్యధికం

Published on Thu, 09/25/2025 - 04:27

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) వేలంలో లియామ్‌ హెండర్సన్‌ అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుధవారం నిర్వహించిన మినీ వేలంలో... ఆస్ట్రేలియా డిఫెండర్‌ కోసం హెచ్‌ఐఎల్‌ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు వేదాంత కళింగ లాన్సర్స్‌ జట్టు 42 లక్షల రూపాయలకు అతడిని సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాళ్లు వివేక్‌ లాక్రా, అద్రోహిత్‌ ఎక్కా కూడా మంచి ధర దక్కించుకున్నారు. 

అంతర్జాతీయ ఆటగాళ్లలో నెదర్లాండ్స్‌ డిఫెండర్‌ సండెర్‌ డె విజిన్‌ను తమిళనాడు డ్రాగన్స్‌ జట్టు రూ. 36 లక్షలకు కొనుగోలు చేసుకుంది. జర్మనీకి చెందిన ప్రిన్జ్‌ను అంతే మొత్తానికి యూపీ రుద్రాస్‌ జట్టు తీసుకుంది. భారత టీనేజ్‌ గోల్‌కీపర్‌ లక్రా రూ. 2 లక్షల ధరతో వేలంలో ప్రవేశించగా... అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ఆఖరికి బెంగాల్‌ టైగర్స్‌ 23 లక్షలకు సొంతం చేసుకుంది. మిడ్‌ఫీల్డర్‌ ఎక్కాను రూ. 11 లక్షలకు సూర్మా హాకీ క్లబ్‌ కొనుగోలు చేసుకుంది. 

14 ఏళ్ల కేతన్‌ కుషా్వహాను బెంగాల్‌ టైగర్స్‌ జట్టు రూ. 2.5 లక్షలకు తీసుకుంది. మొత్తం వేలంలో అతడే అతి పిన్న వయసు్కడు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడైన రూపిందర్‌ పాల్‌ సింగ్‌ను ఎస్జీ పైపర్స్‌ జట్టు రూ. 12 లక్షలకు  సొంతం చేసుకుంది. అతడితో పాటు  బెల్జియంకు చెందిన రోమన్‌ డువెకొట్, నెదర్లాండ్స్‌కు చెందిన బ్రామ్‌ వ్యాన్‌ బాటమ్‌ను కూడా ఫ్రాంచైజీ తీసుకుంది. ఆ్రస్టేలియాకు చెందిన కూపర్‌ బర్న్స్‌ కోసం కళింగ లాన్సర్స్‌ జట్టు రూ. 34.5 లక్షలు వెచ్చించింది. 

మినీ వేలంలో కళింగ ఫ్రాంచైజీ ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసుకుంది. ఆ్రస్టేలియా గోల్‌ కీపర్‌ స్నోడెన్‌ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న లాన్సర్స్‌... ఒడిశా జట్టు ప్లేయర్‌ సునీల్‌ను రూ. 2 లక్షల బేస్‌ ప్రైస్‌కు కొనుగోలు చేసుకుంది.

క్రెయిగ్‌ మరాయిస్, బాబీ సింగ్‌ ధామీని రూ. 10 లక్షల చొప్పున కొనుగోలు చేసుకుంది. యూపీ రుద్రాస్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం అర్ధాంతరంగా తప్పుకోవడంతో... ఆ జట్టు బాధ్యతలను హెచ్‌ఐఎల్‌ గవరి్నంగ్‌ కౌన్సిల్‌ తీసుకుంది. కొత్త యాజమాన్యం వచ్చేంత వరకు ఈ ఫ్రాంఛైజీ హెచ్‌ఐఎల్‌ ఆధ్వర్యంలో నడవనుంది. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)