Breaking News

Hockey India League 2024-25: సెమీస్‌లో బెంగాల్‌ టైగర్స్‌

Published on Tue, 01/28/2025 - 16:56

రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ జట్టు సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ టైగర్స్‌ 2–1 గోల్స్‌ తేడాతో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్‌ టైగర్స్‌ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు  మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్‌ జట్టు టాప్‌-4లోనే ఉండనుంది. 

నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్.. వేదాంత కలింగ లాన్సర్స్‌పై 5-2 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. సూర్మా హాకీ క్లబ్‌ తరఫున టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 32, 54 నిమిషాల్లో గోల్స్‌ చేయగా.. ప్రభ్‌జోత్‌ సింగ్‌ 26వ నిమిషంలో.. నికోలస్‌ కీనన్‌ 33వ నిమిషంలో.. మణిందర్‌ సింగ్‌ 51వ నిమిషంలో గోల్స్‌ చేశారు. లాన్సర్స్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ 5వ నిమిషంలో, థియరీ బ్రింక్‌మన్‌ 44వ నిమిషంలో.. గుర్సబ్‌జిత్‌ సింగ్‌ 56వ నిమిషంలో గోల్స్‌ చేశారు. ఈ గెలుపుతో సూర్మా హాకీ క్లబ్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 

ఇదిలా ఉంటే, మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్‌ (డబ్ల్యూహెచ్‌ఐఎల్‌) టోర్నమెంట్‌లో ఒడిశా వారియర్స్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్‌ సారథ్యంలోని ఒడిశా వారియర్స్‌ 2-1 గోల్స్‌ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్‌ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్‌ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేసి ఒడిశా వారియర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. 

సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్‌ జట్టుకు పెన్నీ స్క్విబ్‌ (28వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్‌ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌ సూర్మా క్లబ్‌ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)