Breaking News

టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర

Published on Tue, 08/12/2025 - 13:27

డిజిటల్‌ వీక్షణకు సంబంధించి టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ను (చివరి రోజు ఓ దశలో) ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం JioHotstar ద్వారా రికార్డు స్థాయిలో 13 మిలియన్ మంది వీక్షించారు. 

డిజిటల్‌ వీక్షణలో ఇది ఆల్‌టైమ్‌ రికార్డు. గతంలో ఏ టెస్ట్‌ మ్యాచ్‌కు ఒకేసారి ఇంత వ్యూయర్‌షిప్‌ దక్కలేదు. ఈ మ్యాచ్‌ డిజిటల్‌ వ్యూయర్‌షిప్‌ రికార్డులను తిరగరాసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. 

చివరి రోజు  (ఆగస్ట్‌ 4) ఇంగ్లండ్‌ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో (చేతిలో 4 వికెట్లు ఉండగా) భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతం చేశాడు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి (3 వికెట్లు తీసి) టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

రికార్డులు బద్దలు
టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ-2025లో ఒక్కో మ్యాచ్‌ ఒక్కో ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగాయి. టెస్ట్‌ క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీన్ని బట్టి చూస్తే భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య పోటీ ఏ రేంజ్‌లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది.

నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సిరీస్‌ను విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు వేర్వేరు మాధ్యమాల ద్వారా రికార్డు స్థాయిలో వీక్షించారు. డిజిటల్‌కు సంబంధించి ఈ సిరీస్‌ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌ ద్వారా 170 మిలియన్లకు పైగా వీక్షించారు. 

డిజిటల్ ప్లాట్‌ఫాం చరిత్రలో ఏ టెస్ట్ సిరీస్‌ను ఇంత మంది వీక్షించలేదు. డిజిటల్‌లో అత్యధిక రీచ్‌ను దక్కించుకున్న సిరీస్‌గా టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ-2025 చరిత్రలో నిలిచిపోతుంది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)