Breaking News

రూ.17.5 కోట్లు డిపాజిట్‌ చేయండి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం

Published on Sat, 09/30/2023 - 08:22

సాక్షి, హైదరాబాద్‌: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్‌ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్‌ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్‌ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్‌ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్‌సీఏకు సూచించింది.

తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్‌ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్‌ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్‌మెంట్లు రద్దు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ.శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్‌సీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్‌ వేరొక చోట ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ వేసిందన్నారు.

దాని ఫలితంగా అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సునీల్‌ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్‌సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)