Breaking News

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!

Published on Thu, 10/17/2024 - 04:51

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ గత సీజన్‌లో తన అద్భుత ఆటతో జట్టును ఫైనల్‌ వరకు చేర్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నమ్మకముంచింది. వచ్చే సీజన్‌కూ అతడిని తమతో అట్టి పెట్టుకునేందుకు రైజర్స్‌ ఆసక్తి చూపిస్తోంది. ఇందు కోసం భారీగా రూ. 23 కోట్లు చెల్లించేందుకు కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒక్కో టీమ్‌ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. 

వీరిలో ఒకరైనా జాతీయ జట్టుకు ఆడని ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌ అయి ఉండాలి. ఈ ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు అక్టోబర్‌ 31 వరకు గవరి్నంగ్‌ కౌన్సిల్‌ గడువు ఇచి్చంది. ప్రతీ టీమ్‌ తాము కొనసాగించే తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు అన్‌క్యాప్డ్‌ అయితే రూ. 4 కోట్లు చెల్లించాలి. 

అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచి్చన విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఫ్రాంచైజీలకు ఉంది. ఈ నేపథ్యంలో కెపె్టన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు రూ. 14 కోట్లు ఇచ్చేందుకు రైజర్స్‌ సిద్ధంగా ఉంది. 2024 సీజన్‌లో క్లాసెన్‌ 15 ఇన్నింగ్స్‌లలో 171.07 స్ట్రయిక్‌రేట్‌తో 479 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి.

అభిõÙక్‌ 16 ఇన్నింగ్స్‌లలో 204.21 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేయగా... 36 ఫోర్లు, 42 సిక్స్‌లు బాదాడు. 2023 ఐపీఎల్‌కు ముందు మినీ వేలంలో క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ రూ. 5.25 కోట్లకు తీసుకొని తర్వాతి ఏడాది కొనసాగించింది. ఇప్పుడు అతనికి లభించే మొత్తం గతంతో పోలిస్తే ఏకంగా 338 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ముగ్గురి కొనసాగింపు దాదాపు ఖరారు కాగా... నాలుగో, ఐదో ఆటగాళ్లుగా ట్రవిస్‌ హెడ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలను కూడా అట్టి పెట్టుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు