Breaking News

వారెవ్వా క్లాసెన్‌.. ఐపీఎల్‌-2025లో భారీ సిక్స‌ర్‌! వీడియో వైర‌ల్‌

Published on Wed, 04/23/2025 - 21:45

ఐపీఎల్‌-2025లో భారీ సిక్స‌ర్ న‌మోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత‌మైన సిక్స్ బాదాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి ప్రేక్షకుల మ‌ధ్య ప‌డింది.

ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్ వేసిన ముంబై స్పిన్న‌ర్ విఘ్నేష్ పుథూర్.. తొలి బంతిని క్లాసెన్‌కు షార్ట్‌బాల్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా భారీ సిక్స‌ర్ బాదాడు. ఈ షాట్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 

కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌ర్మ 106 సిక్స‌ర్ల బాదాడు. తాజా మ్యాచ్‌తో అభిషేక్‌ను క్లాసెన్ అధిగ‌మించాడు. ఇక ఈ మ్యాచ్‌లో క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 13 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను క్లాసెన్ త‌న ఫైటింగ్ నాక్‌తో ఆదుకున్నాడు. 

కేవ‌లం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 71 ప‌రుగులు చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చాహ‌ర్ రెండు, బుమ్రా, హార్దిక్ త‌లా వికెట్ సాధించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)