Breaking News

షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Published on Fri, 03/22/2024 - 14:14

టీమిండియా స్టార్‌ పేసర్‌గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్‌ షమీ కెరీర్‌లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్‌కప్‌-2023లో అదరగొట్టి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం.

అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్‌-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌.

ఇదిలా ఉంటే.. కెరీర్‌పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్‌ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది.

కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్‌. వివాహేతర సంబంధాలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది.

ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్‌ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్‌ జహాన్‌ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్‌ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను.

న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్‌ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్‌ జహాన్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్‌ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. 

ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్‌ జహాన్‌ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్‌ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి