Breaking News

IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌ అతడే!

Published on Fri, 11/29/2024 - 13:07

ఐపీఎల్‌-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్‌లో టైటిల్‌ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. 

సారథులు వీరేనా?
అయితే, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. 

పంజాబ్‌కు శ్రేయస్‌ అయ్యర్‌, ఢిల్లీకి కేఎల్‌ రాహుల్‌, లక్నోకు రిషభ్‌ పంత్‌, కోల్‌కతాకు వెంకటేశ్‌ అయ్యర్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?
ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్‌ పాటిదార్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫిల్‌ సాల్ట్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్‌ స్టార్లు సాల్ట్‌, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్‌, ఇంగ్లండ్‌ లిస్ట్‌-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.

మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్‌ పాటిదార్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్‌ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.  

ఆర్సీబీ కెప్టెన్‌ అతడే!
‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్‌ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్‌ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్‌ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. 

కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.

ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరు
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం గురించి డివిలియర్స్‌ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. 

ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్‌ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని  పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్‌ 2025 సీజన్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: వేలంలో ఎవ‌రూ కొన‌లేదు..! రిటైర్మెంట్ ప్రక‌టించిన టీమిండియా క్రికెట‌ర్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)