Breaking News

MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!

Published on Sat, 03/29/2025 - 14:10

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్‌ (MI)- గుజరాత్‌ టైటాన్స్‌ (GT) శనివారం అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ప్రస్తుత, గుజరాత్‌ మాజీ సారథి హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అయితే, హార్దిక్‌ రాకతో ముంబై తుదిజట్టులో ఎవరిపై వేటు పడుతుందనే అంశంపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్‌ ఆగమనం వల్ల ముంబై మరింత పటిష్టంగా మారుతుందని.. అయితే, రియాన్‌ రికెల్టన్‌ లేదంటే.. విల్‌ జాక్స్‌ సేవలను జట్టు కోల్పోతుందని పేర్కొన్నాడు.

జాక్స్‌కే ఓటు వేస్తా
ఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలంటే తాను మాత్రం జాక్స్‌కే ఓటు వేస్తానని ఆకాశ్‌ చోప్రా స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘హార్దిక్‌ పాండ్యా జట్టులోకి రావడం ముంబైకి భారీ ఉపశమనం. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు లేని లోటు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.

హార్దిక్‌ రాక వల్ల మిడిలార్డర్‌లో స్థిరత్వం చేకూరుతుంది. అయితే, అతడు వచ్చాడు కాబట్టి రియాన్‌ రికెల్టన్‌ లేదంటే విల్‌ జాక్స్‌.. ఈ ఇద్దరిలో ఒకరు తప్పుకోక తప్పదు. నేనైతే విల్‌ జాక్స్‌ను కొనసాగించాలని చెబుతా.

రికెల్టన్‌ను తప్పించండి
ఎందుకంటే గతంలో అతడు ఈ వేదికపై విధ్వసంకర శతకం బాదాడు. మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. అప్పుడు అతడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడేవాడు. 

ఏదేమైనా.. రికెల్టన్‌ను తప్పించి.. విల్‌ జాక్స్‌ను కొనసాగిస్తూ.. రికెల్టన్‌ స్థానంలో రాబిన్‌ మింజ్‌ను వికెట్‌ కీపర్‌గా వాడుకుంటే సరిపోతుంది’’ అని కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇక బౌలింగ్‌ విభాగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రాకతో బౌలింగ్‌ యూనిట్‌ కూడా బలపడుతుంది. ట్రెంట్‌ బౌల్ట్‌, మిచెల్‌ సాంట్నర్‌లతో పాటు రీస్‌ టాప్లీను ఆడించవచ్చు. హార్దిక్‌ రాకతో ముంబై తుదిజట్టులో భారీ మార్పులు ఖాయం’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

అందుకే తొలి మ్యాచ్‌కు దూరం
ఇదిలా ఉంటే.. విల్‌ జాక్స్‌ గతేడాది ఆర్సీబీకి ఆడుతూ.. గుజరాత్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే అజేయ శతకంతో మెరిశాడు. మరోవైపు.. గతేడాది ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా.. హార్దిక్‌ పాండ్యాపై నిషేధం పడింది. 

అందుకే ఐపీఎల్‌-2025లో ముంబై ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడ్డ ముంబై.. నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఐపీఎల్‌-2025లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తుదిజట్టు
రోహిత్ శర్మ, రియాన్‌ రికెల్టన్ (వికెట్‌ కీపర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.

బెంచ్‌: విఘ్నేశ్‌ పుతూర్‌, అశ్వనీ కుమార్‌, రాజ్‌ బవా, కార్బిన్‌ బాష్‌, కర్ణ్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రీస్‌ టాప్లీ, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, హార్దిక్‌ పాండ్యా, క్రిష్ణన్‌ శ్రీజిత్‌, అర్జున్‌ టెండుల్కర్‌, బెవాన్‌ జేకబ్స్‌.

చదవండి: ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)