Breaking News

అద్భుతం... స్పిన్‌ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు.. మాస్టర్‌క్లాస్‌! ఎవరికీ సాధ్యం కాని రీతిలో

Published on Fri, 05/19/2023 - 11:30

IPl 2023 SRH vs RCB- Heinrich Klaasenహెన్రిచ్‌ క్లాసెన్‌.. ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాప్‌ స్కోరర్‌. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకునే క్లాస్‌ ప్లేయర్‌. ఈ సీజన్‌లో ఈ మిడిలార్డర్‌ ఇప్పటి వరకు చేసిన మొత్తం పరుగులు 430. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఈ మేరకు స్కోరు సాధించాడు.

మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడు
అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ప్రొటిస్‌ బ్యాటర్‌. ఇక ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడినప్పటికీ క్లాసెన్‌ తన అద్భుత సెంచరీతో అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు రాబట్టాడు.

ఈ నేపథ్యంలో జట్టు మెరుగైన స్కోరు సాధించేలా ఒంటరి పోరాటం చేయడం అలవాటు చేసుకున్న అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం క్లాసెన్‌ అద్భుత బ్యాటింగ్‌ ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు.

ఏ విదేశీ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో
‘‘క్లాసెన్‌ బ్యాటింగ్‌ అద్భుతం. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఏ విదేశీ ప్లేయర్‌ కూడా తనలా ఇండియన్‌ పిచ్‌లపై స్పిన్నర్లను అటాక్‌ చేయడం నేను చూడలేదు.

విదేశీ ఆటగాళ్లనే కాదు ఈ టోర్నీలో ఆడుతున్న ప్రతి ఒక్క బ్యాటర్‌కు కూడా స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తన మాస్టర్‌క్లాస్‌తో నిరూపించాడు. గత మూడు మ్యాచ్‌లలో అతడి బ్యాటింగ్‌ ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పరిస్థితులకు తగ్గట్లుగా
ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఒక్కరు కూడా క్లాసెన్‌లా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడుతూనే దూకుడు కూడా ప్రదర్శిస్తాడు’’ అంటూ ఆకాశ్‌ చోప్రా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు.

కాగా ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ తరఫున నిలకడైన ఆట తీరు కనబరుస్తున్న ఏకైక ఆటగాడు అంటే క్లాసెన్‌ ఒక్కడే! ఇక ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి సెంచరీ సాధించి శతక లోటు కూడా తీర్చేసుకున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. 

చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి
కోహ్లి భారీ సిక్సర్‌.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్‌ రియాక్షన్‌ వైరల్‌

Videos

DSC అక్రమాలపై లోకేష్‌ జైలుకు వెళ్లడం పక్కా

సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి

భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

Photos

+5

ఉదయ బాను నిర్మాతగా.. ‘పంచనామా’ సిరీస్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)