Breaking News

HCA: మహిళా క్రికెట్‌ హెడ్‌కోచ్‌పై వేటు

Published on Fri, 02/16/2024 - 11:27

మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. 

కాగా విజయవాడలో మ్యాచ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్‌ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్‌ చేశారు.

ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా..  కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు  నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. 

క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్‌ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: BCCI: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లకు జై షా వార్నింగ్‌.. ఇకపై

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌