Breaking News

HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు

Published on Wed, 06/19/2024 - 09:58

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లుగా తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)తో నడుస్తున్న విద్యుత్‌ వివాదానికి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్‌ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. 

ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్‌ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్‌ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్‌ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. 

మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.

ఈ మేరకు మంగళవారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషా రఫ్‌ అలీ ఫరూఖీకి జగన్‌మోహన్‌ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్‌ రూపంలో అందించారు. 

విద్యుత్‌ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్‌ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్‌ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్‌ ఈ సందర్భంగా కోరారు.

చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)