Breaking News

రన్నరప్‌ ఆంధ్రప్రదేశ్‌

Published on Wed, 12/24/2025 - 03:58

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టీమ్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హరియాణా 3–0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్‌ పీవీ సింధు ఫైనల్‌ మ్యాచ్‌కు దూరంగా ఉంది. తొలి మ్యాచ్‌లో దేవిక సిహాగ్‌ 20–22, 21–16, 21–16తో నవ్య కందేరిపై గెలిచింది. 

రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–14, 21–14తో సూర్య చరిష్మా తామిరిపై నెగ్గి హరియాణాకు 2–0తో ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌లో ఉన్నతి–అన్‌మోల్‌ ద్వయం 21–13, 24–22తో నవ్య–సూర్య చరిష్మా జంటపై గెలవడంతో హరియాణాకు టైటిల్‌ ఖరారైంది. రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టులో నవ్య, సూర్య చరిష్మా, సీహెచ్‌ఎస్‌ఆర్‌ ప్రణవి, దీపిక దేవనబోయిన, కవిప్రియ సభ్యులుగా ఉన్నారు. 

పురుషుల టీమ్‌ విభాగంలో తమిళనాడు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తమిళనాడు 3–2తో హరియాణా జట్టును ఓడించింది. విజేత జట్లు హరియాణా, తమిళనాడు జట్లకు రూ. 3 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. నేటి నుంచి ఐదు రోజులపాటు పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)