అంపైర్‌తో వాగ్వాదం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు భారీ షాక్‌

Published on Sat, 03/08/2025 - 08:45

లక్నో: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై జరిమానా పడింది. గురువారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో వాదనకు దిగినందుకు హర్మన్‌ప్రీత్‌ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత పడింది. యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ముగిసిన సమయంలో అంపైర్‌ అజితేశ్‌ అర్గాల్‌... సర్కిల్‌ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంచాలని హర్మన్‌ప్రీత్‌కు సూచించాడు.

స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు గానూ చివరి ఓవర్‌లో బౌండరీ సమీపంలో నలుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం లేదని హర్మన్‌కు వివరించాడు. దీంతో అంపైర్‌తో ముంబై సారథి వాగ్వాదానికి దిగింది. ఆల్‌రౌండర్‌ అమెలియా కెర్‌ కూడా హర్మన్‌కు వంతపాడింది. దీంతో ఈ ఘటనపై రిఫరీ క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నాడు.

‘హర్మన్‌ప్రీత్‌ లెవల్‌–1 తప్పిదానికి పాల్పడింది. నియమావళిలోని 2.8 ఆర్టికల్‌ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడతో మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని డబ్ల్యూపీఎల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యర్థి ప్లేయర్‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌తోనూ హర్మన్‌ప్రీత్‌ వాదనకు దిగింది. కాగా... ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు చేరువైంది.
చదవండి: CT 2025: భార‌త్-న్యూజిలాండ్ ఫైన‌ల్ పోరు.. బ్యాట‌ర్ల‌కు చుక్క‌లే! ఎందుకంటే?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)