Breaking News

‘మా విజయం రాత మారుస్తుంది’

Published on Tue, 11/04/2025 - 05:57

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టు వన్డేలు, టి20 ఫార్మాట్‌లు కలిపి మూడుసార్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. సెమీఫైనల్‌ దశలో కూడా ఎదురైన పరాజయాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చినా అసలు విజయం మాత్రం దక్కలేదు. అయితే ఇప్పుడు దక్కిన ప్రపంచ కప్‌తో భవిష్యత్తులో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుందని కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వ్యాఖ్యానించింది. 

‘మేం మంచి క్రికెట్‌ ఆడుతున్నామని ఎన్నో ఏళ్లుగా చాలాసార్లు ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక పెద్ద విజయం లేకుండా ఇలాంటి మాటలన్నీ వృథా అని మాకు బాగా తెలుసు. అలాంటి గెలుపు వస్తేనే మార్పు గురించి మాట్లాడాలి. దీని కోసం ఎంతగానో ఎదురు చూశాం. ప్రతీ టోర్నీ ముగియగానే నేను, స్మృతి బాధతో ఇంటికి వెళ్లిపోవడం, నిశ్శబ్దంగా కొద్ది రోజులు గడపడం, ఆపై తిరిగొచ్చి మళ్లీ కొత్తగా మొదలుపెట్టడం జరిగేది. 

దీనికి ముగింపు ఎప్పుడు అని మేం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నాం. నా ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. నా జట్టును చూస్తే గర్వంగా ఉంది. ఈ విజయంతో ఇకపై మరిన్ని విజయాలకు ప్రేరణ అందడంతో పాటు మహిళల క్రికెట్‌ స్థాయి మరింత పెరగడం ఖాయం’ అని హర్మన్‌ చెప్పింది. లీగ్‌ దశలో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తయిన తర్వాత తమలో మరింత కసి పెరిగిందని, అదే తర్వాతి మ్యాచ్‌లలో కనిపించిందని హర్మన్‌ పేర్కొంది. 

‘ఇంగ్లండ్‌ మ్యాచ్‌ తర్వాత మా ఆలోచనా ధోరణి మారింది. వ్యూహాలు కూడా మార్చాలని, కొత్తగా మొదలు పెట్టాలని అర్థమైంది. ఆ ఓటమి ప్రభావం అందరిపై పడింది. ఇన్నేళ్లుగా సిద్ధమై ఇలా ఎలా ఓడామని అంతర్మథనం జరిగింది. ఫలితంగా పట్టుదల పెరిగి మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాం’ అని కెపె్టన్‌ వెల్లడించింది. తమపై తమకు ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కారణంగానే ఫైనల్లో విజయం దక్కిందని హర్మన్‌ అభిప్రాయపడింది.
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)