Breaking News

హారిక డబుల్‌ ధమాకా...

Published on Fri, 07/31/2026 - 03:58

ఆసియా మహిళల చెస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అదరగొట్టింది. హాంకాంగ్‌లో గురువారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో హారిక ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలో విజేతగా నిలిచింది. 50 మంది ప్లేయర్లు పోటీపడ్డ ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో హారిక, అనా షుఖ్‌మన్‌ (రష్యా) నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో హారికకు టైటిల్‌ ఖరారైంది. అనా షుఖ్‌మన్‌ రన్నరప్‌ ట్రోఫీ దక్కించుకుంది. 

హారిక ఆరు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మరోవైపు బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో 46 మంది క్రీడాకారిణులు పోటీపడ్డారు. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత హారిక 10.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. హారిక తొమ్మిది గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓటమి పాలైంది. 10 పాయింట్లతో వాలెంటీనా గునీనా (రష్యా) రెండో స్థానం పొందింది. ఇదే టోర్నీ పురుషుల ర్యాపిడ్, బ్లిట్జ్‌ విభాగాలలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గౌతమ్‌ కృష్ణకు రెండో స్థానం దక్కించి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)