Breaking News

రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

Published on Mon, 10/07/2024 - 18:19

భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌కు దీపా రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. రిటైర్మెంట్‌ తర్వాత కర్మాకర్‌ కోచ్‌గా లేదా మెంటార్‌ తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

"జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌కు విడ్కోలు ప‌ల‌క‌డానికి ఇదే స‌రైన స‌మయంగా భావిస్తున్నాను. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌విచూశాను. 

నాకు ఐదేళ్లు ఉన్న‌ప్పుడు నా ఫ్లాట్ ఫుట్ కార‌ణంగా జిమ్నాస్ట్ కాలేనని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం నాకు ఎంతో ప్ర‌త్యేకం. ముఖ్యంగా రియో ​​ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ను ప్రదర్శించడం నా కెరీర్‌లో మరపురాని క్షణాల్లో ఒక‌టి" అని త‌న రిటైర్మెంట్ నోట్‌లో దీపా పేర్కొంది. 

కాగా 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో కర్మాకర్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్‌ గేమ్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియన్‌ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా నిలిచింది. రియో ఒలిపింక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని ఆమె చేజార్చుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే పారిస్‌ ఒలిపింక్స్‌ ఆర్హత సాధించడంలో 31 ఏళ్ల దీపా విఫలమైంది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)