Breaking News

పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌( వీడియో)

Published on Fri, 10/11/2024 - 14:24

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జ‌ట్టు ఇప్ప‌టినుంచే స‌న్నాహాకాలు ప్రారంభించింది. దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25 సీజ‌న్‌లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌, స్టార్క్, హాజిల్‌వుడ్‌ మిన‌హా మిగితా ఆసీస్ అగ్రశ్రేణి ఆట‌గాళ్లంతా పాల్గోంటున్నారు.

అయితే ఈ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదిక‌గా న్యూ సౌత్ వేల్స్,  సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఫ‌న్నీ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ నాథ‌న్ లియాన్‌ గ‌ల్లీ క్రికెట్‌ మాద‌రి బంతిని పొద‌ల్లో వెతుకుతూ న‌వ్వులు పూయించాడు. ఈ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్‌కు లియాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

అస‌లేం జ‌రిగిందంటే?
సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 56 ఓవ‌ర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి క్యారీ భారీ సిక్స‌ర్ బాదాడు. దెబ్బ‌కు బంతి మైదానం వెలుపుల ఉన్న పొద‌ల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో న్యూ సౌత్ వేల్స్ ఫీల్డ‌ర్లు బంతిని ఆ పొద‌ల్లో వెత‌కడం ప్రారంభించారు. కానీ బంతి క‌న్పించ‌లేదు. 

దీంతో బంతిని వెతికేందుకు లియాన్ స్వ‌యంగా రంగంలోకి దిగాడు. అయితే అత‌డికి ఓ బంతి దొరికింది. కానీ లియాన్‌కు దొరికింది రెడ్ బాల్ కాదు వైట్ బాల్‌. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా న‌వ్వుకున్నారు. ఇంత‌కుముందు ఎప్పుడో క‌న్పించ‌కుండా పోయిన బంతి ఇప్పుడు నాథ‌న్‌కు దొరింది.

 కానీ తాజాగా పోయిన బంతి మాత్రం వారికి దొర‌క‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతుంది. కాగా ఎటువంటి సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా గ‌ల్లీ క్రికెట్‌లో జ‌రుగుతూ ఉంటాయి.


 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)