Breaking News

మూడో గేమ్‌లో గుకేశ్‌ గెలుపు

Published on Thu, 11/28/2024 - 04:10

సింగపూర్‌ సిటీ: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో గేమ్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)తో బుధవారం జరిగిన మూడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన 18 ఏళ్ల గుకేశ్‌ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. నిబంధనల ప్రకారం తొలి 40 ఎత్తులను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. 

అయితే డింగ్‌ లిరెన్‌ 37 ఎత్తులే వేయగలిగాడు. దాంతో సమయాభావం కారణంగా డింగ్‌ లిరెన్‌కు ఓటమి ఖరారైంది. ‘తొలి విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి లోనయ్యా. రెండో గేమ్‌ నుంచి కోలుకున్నాను’ అని గుకేశ్‌ వ్యాఖ్యానించాడు. 

ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరగనున్నాయి. తొలి గేమ్‌లో డింగ్‌ లిరెన్‌ నెగ్గగా... రెండో గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1.5–1.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో గేమ్‌ జరుగుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)