Breaking News

సంయుక్తంగా అగ్రస్థానంలో గుకేశ్‌ 

Published on Sat, 04/20/2024 - 04:01

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్‌ 12వ రౌండ్‌ తర్వాత 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నిపోమ్‌నిషి (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 12వ రౌండ్‌లో గుకేశ్‌ 57 ఎత్తుల్లో నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)ను ఓడించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌కిది నాలుగో విజయం.

భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద, విదిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిపోమ్‌నిíÙతో జరిగిన గేమ్‌ను తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... మహారాష్ట్ర ప్లేయర్‌ విదిత్‌ 52 ఎత్తుల్లో కరువానా (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణీత 14 రౌండ్‌లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌తో ప్రపంచ టైటిల్‌ కోసం పోటీపడతాడు.

మరోవైపు మహిళల విభాగంలో భారత స్టార్‌ కోనేరు హంపి ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. గొర్యాచ్‌కినా (రష్యా)తో జరిగిన 12వ రౌండ్‌ గేమ్‌ను హంపి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి 57 ఎత్తుల్లో నెగ్గింది.  హంపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.   

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)