Breaking News

అగ్ర స్థానంలోనే గుకేశ్‌

Published on Wed, 04/17/2024 - 03:58

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు డి.గుకేశ్‌ పది రౌండ్ల తర్వాత కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గుకేశ్, నెపొమినియాచి (రష్యా) మధ్య జరిగిన పదో రౌండ్‌ గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఈ గేమ్‌ అనంతరం వీరిద్దరు కూడా చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

ఇతర గేమ్‌లలో ఫిరూజా అలీరెజా (ఫ్రాన్స్‌)పై ఫాబియానో కరునా (అమెరికా)... నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)పై హికారు నకమురా (అమెరికా) విజయం సాధించారు. ఇద్దరు భారత ఆటగాళ్లు విదిత్‌ గుజరాతీ, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్‌ ‘డ్రా’ అయింది. ప్రజ్ఞానంద, నకమురా (5.5 పాయింట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కోనేరు హంపికి మరో ‘డ్రా’ ఎదురైంది.

పదో గేమ్‌లో హంపి, జ్యోంగి తాన్‌ (చైనా) సమ ఉజ్జీలుగా నిలిచారు. అయితే మరో భారత ప్లేయర్‌ ఆర్‌.వైశాలి...సలిమోవా (బల్గేరియా)పై గెలుపొందింది. చైనాకు చెందిన లీ టింగ్‌జీ, జ్యోంగి తాన్‌ ప్రస్తుతం 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)