Breaking News

గుకేశ్‌కు వరుసగా రెండో ఓటమి

Published on Sun, 01/25/2026 - 03:48

విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్‌లో నొదిర్బాక్‌ అబ్దుస్సత్తరోవ్‌  (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిన గుకేశ్‌... శనివారం ఏడో రౌండ్‌లో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) చేతిలో  కూడా పరాజయం పాలయ్యాడు. ఏడు రౌండ్‌ల తర్వాత గుకేశ్‌ ఒకే ఒక రౌండ్‌లో గెలిచి రెండు పరాజయాలు, నాలుగు డ్రాలు నమోదు చేశాడు. 

మరో భారత ఆటగాడు ప్రజ్ఞానంద, బ్లూబమ్‌ మథియాస్‌ (జర్మనీ) మధ్య జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ డ్రాగా ముగియగా, వాన్‌ ఫారెస్ట్‌ జోర్డాన్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో అరవింద్‌ చిదంబరం ఓడిపోయాడు. ఆరో రౌండ్‌లో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి... బ్లూబమ్‌ మథియాస్‌ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు.  

ఏడు రౌండ్‌లు ముగిసే సరికి నాలుగు విజయాలు సాధించిన అబ్దుస్సత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోర్నమెంట్‌లో 14 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటుండగా... ప్రతీ ప్రత్యరి్థతో ఒక్కో సారి ఆడుతూ ఆటగాళ్లు 13 రౌండ్లలో తలపడాల్సి ఉంటుంది.    

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)