Breaking News

ఫ్రీ స్టయిల్‌ చెస్‌ నాకౌట్‌కు గుకేశ్‌

Published on Sun, 02/09/2025 - 02:52

హంబర్గ్‌ (జర్మనీ): భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ చెస్‌ టూర్‌లో నాకౌట్‌కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్‌ చివరి మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్‌ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన గుకేశ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని భారత గ్రాండ్‌మాస్టర్‌... ఏడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు. 

ఫలితంగా గుకేశ్‌ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్‌ నాకౌట్‌లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్‌ దశ ముగిసే సరికి ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్‌కు చెందిన జవోకిర్‌ సిందరోవ్‌ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 

అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్‌ కైమెర్‌ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్‌’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్‌కు చెందిన నొదిర్‌బెక్‌ అబ్దుసత్తోరోవ్, గుకేశ్‌ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.   

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)