గుజరాత్‌కు భారీ షాక్‌.. స్వ‌దేశానికి వెళ్లిపోయిన ర‌బాడ‌

Published on Thu, 04/03/2025 - 20:07

ఐపీఎల్‌-2025లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్, ద‌క్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ త‌న స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు.  "వ్యక్తిగత కారణాల‌" కారణంగా ర‌బాడ సౌతాఫ్రికాకు వెళ్లిన‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్ మెనెజ్‌మెంట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అయితే అత‌డు ఎప్పుడు తిరిగి భార‌త్‌కు వ‌స్తాడ‌న్న విష‌యాన్ని గుజ‌రాత్ వెల్ల‌డించలేదు. కాగా బుధ‌వారం(ఏప్రిల్ 2)న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌కు కూడా ర‌బాడ దూర‌మ‌య్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ర‌బాడ లేన‌ప్ప‌టికి గుజ‌రాత్ టైటాన్స్ మాత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 

మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిద్ద్ కృష్ణ, ఇషాంత్‌​ శర్మ వంటి గుజరాత్ స్పీడ్ స్టార్లు అద్బుతంగా రాణించారు. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 6న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా రబాడ దూరమయ్యే అవకాశముంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన రబాడ.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే రబాడ తనదైన ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు.
చ‌ద‌వండి: పాక్‌ క్రికెట్‌ జట్టుకు మరోసారి జరిమానా

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)