Breaking News

గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్‌ షమీ

Published on Tue, 05/16/2023 - 10:43

IPL 2023 GT Vs SRH- Mohammed Shami: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్‌ టైటాన్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమీ. పవర్‌ ప్లేలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రైజర్స్‌ ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(5), కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌(10), రాహుల్‌ త్రిపాఠి (1), హెన్రిచ్‌ క్లాసెన్‌ (64) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న షమీ
టాపార్డర్‌ను కకావికలం చేసిన షమీ.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి మొత్తంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. తద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో అదరగొట్టిన షమీ.. పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన ఈ టీమిండియా పేసర్‌.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ అనంతరం షమీ.. కామెంటేటర్‌ రవిశాస్త్రితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

నువ్వేం తింటావు? గుజరాత్‌లో ఉన్నాను కదా!
నువ్వేమి తింటావు? షమీ అంటూ రవిశాస్త్రి షమీని అడుగగా.. ‘‘గుజరాత్‌లో ఉన్నాను కదా! నాకు ఏది ఇష్టమో అది తినలేకపోతున్నా!’’ అని సరదాగా బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. కాగా షమీకి బిర్యానీ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో తన ఫేవరెట్‌ బిర్యానీని మిస్‌ అవుతున్నానంటూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్‌ గురించి చెబుతూ.. ‘‘సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌల్‌ చేయడానికి ప్రయత్నిస్తాను. నా బలం అదే! కొత్త బంతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటా. 

వాళ్లు సైతం
నేటి మ్యాచ్‌లో మిడిల్‌ ఓవర్లలో మోహిత్‌ శర్మ అద్భుతం చేశాడు. రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ కూడా తమ వంతు పాత్ర పోషించారు’’ అని మహ్మద్‌ షమీ చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ సాధించడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్‌కు గుజరాత్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, మోహిత్‌ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగగా.. యశ్‌ దయాల్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టైటాన్స్‌ బౌలర్ల విజృంభణతో 154 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్‌ ఓటమిపాలై ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ దూరం!
ఆరోజు నైట్‌ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్‌ కోహ్లి

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)