Breaking News

మహిళల ఐపీఎల్‌ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..?

Published on Sat, 03/04/2023 - 15:20

తొట్టతొలి మహిళల ఐపీఎల్‌ (WPL) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ (మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా 2023 WPL ఇనాగురల్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ జెయింట్స్‌.. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గుజరాత్‌ జెయింట్స్‌కు బెత్‌ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం వహిస్తుంది. 

ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్‌ టీమ్‌లో కెప్టెన్‌ మూనీ, యాష్లే గార్డెనర్‌, అనాబెల్‌ సదర్లాండ్‌, స్నేహ్‌ రాణా, హర్లీన్‌ డియోల్‌, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్‌ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా  కెర్ర్‌, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్‌ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ముఖ్యంగా ముంబై టీమ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా  కెర్ర్‌, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా సంచలన ప్రదర్శనలు నమోదు చేసే ఛాన్స్‌ ఉంది. ఇటీవలికాలంలో వీరి ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ ఐదుగురిని ఆపడం కష్టమని సుస్పష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్స్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే.. గుజరాత్‌పై పైచేయి సాధించడం హర్మన్‌ సేనకు పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా విండీస్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్‌ తప్పుకోవడం గుజరాత్‌కు మైనస్‌గా చెప్పవచ్చు. గుజరాత్‌ విజయావకాశలు కెప్టెన్‌ బెత్‌ మూనీ, యాష్లే గార్డ్‌నర్‌, హర్లీన్‌ డియోల్‌, స్నేహ్‌ రాణాలపైనే అధారపడి ఉన్నాయి.

కాగా, WPL టీవీ లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను స్పోర్ట్స్‌ 19 నెట్‌వర్క్‌ దక్కించుకోగా.. డిజిటల్‌ రైట్స్‌ను జియో సినిమా యాప్‌, వెబ్‌సైట్‌ సొంతం చేసుకున్నాయి. 

ముంబై ఇండియన్స్‌..
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా  కెర్‌, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.

గుజరాత్‌ జెయింట్స్‌..
బెత్‌ మూనీ (కెప్టెన్‌), యాష్లే గార్డ్‌నర్‌,జార్జియా వేర్‌హమ్‌,స్నేహ్‌ రాణా, అనాబెల్‌ సదర్లాండ్‌, కిమ్‌ గార్త్‌, సోఫియా డన్‌క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్‌, హర్లీన్‌ డియోల్‌, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్‌, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్‌ షకీల్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)