Breaking News

తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్‌.. స్టార్‌ క్రికెటర్‌ దూరం!

Published on Sat, 03/04/2023 - 12:27

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌కు సర్వం సిద్దమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్‌ షురూ కానుంది.  ఈ మ్యాచ్‌ డివై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ జెయింట్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్ గాయం ​కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. ముంబై వేదికగా జరిగిన వేలంలో డాటిన్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగొలు చేసింది. ఇక గుజరాత్‌ తమ జట్టులో డాటిన్‌ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్‌ కిమ్ గార్త్‌తో భర్తీ చేసింది.  ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా గుజరాత్‌ ప్రకటించింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కిమ్ గార్త్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్‌ దూరం కావడంతో ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్‌ గార్త్‌కు దక్కింది. రూ.60 లక్షల కనీస ధరకు గార్త్‌తో గుజరాత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్‌లో గుజరాత్‌ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌  బెత్ మూనీ వ్యవహరించనుంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్‌కు నో ఛాన్స్‌! కిషన్‌ అరంగేట్రం
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)