Breaking News

#GTvsCSK: ఫైనల్‌ మ్యాచ్‌ వాయిదా.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

Published on Sun, 05/28/2023 - 23:28

సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఆదివారం(మే 28న)  ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 16వ సీజన్‌ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్‌ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఐపీఎల్‌ చరిత్రలో ఒక ఫైనల్‌ మ్యాచ్‌ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్‌ డేకు వాయిదా పడింది లేదు.

ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్‌మ్యాచ్‌ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్‌ అధికారిపై మహిళ దౌర్జన్యం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)