Breaking News

Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్‌ దిగ్గజం

Published on Fri, 10/27/2023 - 09:02

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్‌ స్వయంగా ధృవీకరించారు.  

మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో సమావేశమైన ఛాపెల్‌ స్నేహితులు.. ‘గో ఫండ్‌ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్‌ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. 

‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్‌ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్‌ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’  అని అన్నారాయన. 

ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు