ప్రపంచకప్‌ టోర్నీకి గ్రేస్‌ హారిస్‌ దూరం

Published on Wed, 09/24/2025 - 08:09

బెంగళూరు: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హారిస్‌... త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి దూరమైంది. పిక్క కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న గ్రేస్‌... ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. దీంతో ఆమె స్థానంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హీథర్‌ గ్రహమ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. 

ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ జరగనుండగా... ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఆసీస్‌ గెలుపొందింది. 

ఈ సిరీస్‌ సందర్భంగానే 28 ఏళ్ల హారిస్‌ గాయపడింది. శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆమె కాలుకు గాయమైంది. గ్రేస్‌ ఇప్పటి వరకు ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఒక వన్డే, ఐదు టి20లు ఆడి... తొమ్మిది వికెట్లు పడగొట్టింది.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)