Breaking News

గోవా ఘనవిజయం

Published on Sat, 12/21/2024 - 03:59

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ 2–1 గోల్స్‌ తేడాతో మోహన్‌ బగాన్‌పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్‌ ఫెర్నాండెజ్‌ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా... మోహన్‌ బగాన్‌ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్‌ (55వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేశాడు. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్‌ బగాన్‌ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి ఒక గోల్‌ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. 

లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్‌ బగాన్‌ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. 

శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో చెన్నైయిన్‌ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుతో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)