Breaking News

ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం

Published on Wed, 11/01/2023 - 15:54

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గాయం కారణంగా నవంబర్‌ 4న ఇంగ్లండ్‌తో  జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే.

అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండడంతో ఆసీస్‌ ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గోల్ప్‌ ఆడుతుండగా గాయ పడ్డాడు.  గోల్ఫ్ కార్ట్ వాహనం వెనుక నుండి జారి పడడంతో తలకు గాయమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. దీంతో కంకషన్ ప్రోటోకాల్స్ రూల్స్‌ ప్రకారం మ్యాక్సీ దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండనున్నాడు.

కాగా మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని, సెమీఫైనల్స్‌కు అందుబాటులో ఉండే ఛాన్స్‌ ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ​​కాగా మ్యాక్సీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో 106 పరుగులు) మ్యాక్స్‌వెల్‌ బాదాడు.
చదవండి: CWC 2023: సూర్యకుమార్‌ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)