కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం
Breaking News
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Published on Wed, 05/22/2024 - 21:12
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.
ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు.
Tags : 1